విహారయాత్రలో సుశాంత్‌ - రియా చక్రవర్తి

‘కేదార్‌నాథ్‌’ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఇప్పుడు విదేశీయాత్రలో విహరిస్తున్నాడు. ఈ విహార యాత్రలో ఒంటరిగా వెళ్లలేదు సుశాంత్‌. తోడుగా ప్రియురాలు రియా చక్రవర్తిని కూడా తీసుకెళ్లాడట. గత కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే పారిస్‌లో ఎక్కడ ఇద్దరూ ఒకేచోట కలిసున్న ఫోటోలు మాత్రం బయటకు రాలేదు. రియా చక్రవర్తి ఈఫిల్‌ టవర్‌ వద్ద ఒక్కతే చేతులు చాచి ఈ ప్రపంచమంతా నాదే అన్నట్టు ఫోటోకు ఫోజులిచ్చింది. మరో పక్క సుశాంత్‌ ప్రముఖ హాలీవుడ్‌ స్టూడియో అయిన డిస్నీల్యాండ్‌లోకి వెళ్తున్న వీడియోను ఒక్కదాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టి సందడి చేస్తున్నాడు. సుశాంత్‌ తన ఇన్‌స్టాలో.. ‘‘లివింగ్‌ మై డ్రీమ్స్‌.. లవింగ్‌ మై డ్రీమ్స్‌’’ అందమైన కవితను రాసుకున్నాడు. మొత్తం మీద సుశాంత్, రియాలు ఇలా ప్రేమలో దొంగాట ఆడుతున్నారా అని బాలీవుడ్‌ జనాలు అనుకుంటున్నారు. తెలుగులో రియా చక్రవర్తి - ఎం.ఎస్‌.రాజు దర్శకత్వంలో వచ్చిన ‘తూనీగ తూనీగ’లో కథానాయికగా నటించింది. ప్రస్తుతం రియా రూమి జెఫ్రీ దర్శకత్వంలో వస్తున్న ‘చెహ్రి’లో నటిస్తుండగా, సుశాంత్‌ ‘డ్రైవ్‌’, ‘దిల్‌ బిచారా’లో నటిస్తున్నాడు.

View this post on Instagram

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on

View this post on Instagram

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.