శభాష్‌ టైగర్‌ అనిపించుకున్నాడు

బా
లీవుడ్‌ యాక్షన్‌ హీరో టైగర్‌ ష్రాఫ్‌ నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేశారు. జిమ్‌లో 200 కేజీల బరువు ఎత్తుతూ ఉన్న ఓ వీడియోను సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ఇది చూసిన అభిమానులు ‘నిజమైన టైగర్, అద్భుతం, ఇది ఎలా సాధ్యమైంది, టైగర్‌ మీరు చేయగలరు, గ్రేట్‌..’ అంటూ తెగ కామెంట్లు చేశారు. ఈ వీడియోను ఇప్పటి వరకు 17 లక్షల మందికి పైగా వీక్షించారు. బాలీవుడ్‌ నటుడు ఇషాన్‌ ఖత్తర్‌ కూడా వీడియోను చూసి స్పందించడం విశేషం. ‘‘సూపర్‌ హ్యూమన్‌’’ అంటూ తన అభిప్రాయం తెలిపాడు. టైగర్‌ ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఆయన డ్యాన్స్‌కు చాలా మంది ఫ్యాన్స్‌ ఉన్నారు. తన డ్యాన్స్‌ వీడియోలను పలు సందర్భాల్లో ఆయన సోషల్‌ మీడియాలో పోస్టు చేసి, అభిమానుల్ని ఆకట్టుకున్నారు. ప్రస్తుతం టైగర్‌ ష్రాఫ్‌ ‘వార్‌’ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో హృతిక్‌ రోషన్‌ మరో కథానాయకుడు. అక్టోబర్‌ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.