కమల్‌తో నటించకపోవడానికి కారణం చెప్పిన జమ్వాల్‌!

బాలీవుడ్‌ నటుడు విద్యుత్‌ జమ్వాల్‌ తొలుత ‘భారతీయుడు2’లో నటించనున్నారనే వార్తలొచ్చాయి. కానీ ఈ చిత్రంలో జామ్వాల్‌ నటించకపోవడానికి కారణం వేరే ఉందట. ‘ఇండియన్‌2’లో తను ఎందుకు నటిండం లేదో మాట్లాడుతూ..‘‘మొదట నన్ను ‘ఇండియన్‌2’లో నటించమని అడిగారు. కానీ ‘ఖుదా హఫీజ్‌’ చిత్రం కోసం అప్పటికే సంతకం చేసి ఉన్నాను. అందువల్లే ‘ఇండియన్‌2’లో నటించే గొప్ప అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చిందటూ’’ చెప్పాడు. అన్నట్లు త్వరలోనే శృతిహాసన్, విద్యుత్‌ జమ్వాల్‌లు కలిసి మహేష్‌ మంజ్రేకర్‌ దర్శకత్వంలో చేయనున్నారు. ఆ చిత్రానికి ‘పవర్‌’ అనే పేరు పెట్టారట. ప్రస్తుతం విద్యుత్‌ ‘కమాండో3’ చిత్రంలో నటిస్తున్నారు. సినిమా ప్రచార కార్యక్రమాల్లో జామ్వాల్‌ బిజీగా ఉన్నాడు. ఇందులో గుల్షన్‌ దేవయ్య, అంగిరా ధర్, ఆదా శర్మ ఇన్స్‌పెక్టర్‌ భువనా రెడ్డిగా నటిస్తోంది. చిత్రం డిసెంబర్‌ 29, 2019న తెరపైకి రానుంది.





Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.