విజయం వరిం‌చని హీరో
నిర్మాత దర్శ‌కుడు నాజిర్‌ హుస్సేన్‌ నిర్మించి ‌‘యాదోం కి బారాత్‌’‌ సిని‌మాలో ధర్మేం‌ద్రకు తమ్ము‌డిగా నటిం‌చిన విజయ్‌ అరోరా బహుశా గుర్తుండే ఉంటాడు.‌ అలాగే రామా‌నంద్‌ సాగర్‌ నిర్మిం‌చిన ‌‘రామా‌యణ్‌’‌ టెలి‌వి‌జన్‌ సీరి‌యల్లో ఇంద్రజి‌త్‌గా అద్భుత నట‌నను ప్రద‌ర్శిం‌చిన విజయ్‌ అరోరా మంచి అంద‌గాడు.‌ కానీ ఏమి లాభం.‌ అత‌డికి అదృష్టం కలి‌సి‌రా‌లేదు.‌ 1971లో పూనా ఫిలిం ఇన్‌స్టి‌ట్యూట్‌ నుంచి నట‌నలో బంగారు పతకం సాధిం‌చిన విజయ్, బి.‌ఆర్‌.‌ఇషారా దర్శ‌క‌త్వంలో ‌‘జరూ‌రత్‌’‌ (1972) అనే సిని‌మాలో తొలి‌సారి హీరోగా నటిం‌చాడు.‌ నటి రీనా‌రా‌య్‌కి కూడా మొదటి సినిమా.‌ తర్వాత ఆశా‌ప‌రేఖ్‌ సర‌సన ‌‘రాఖి అవుర్‌ హాథ్‌ కడి’‌ సిని‌మాలో నటిం‌చాడు.‌ ‌‘యాదోం కి బారాత్‌’‌ అత‌నికి మూడవ సినిమా.‌ వర‌సగా జయ‌బా‌ధు‌రితో ‌‘ఫాగున్‌’, షబా‌నా‌ఆ‌జ్మితో ‌‘కాదం‌బరి’, తనూ‌జతో ‌‘ఇన్సాఫ్‌’, పర్వీన్‌ బాబితో ‌‘36 ఘంటే’, మౌసామీ చట‌ర్జీతో ‌‘నాటక్‌’‌ వంటి సిని‌మాల్లో నటిం‌చినా విజయ్‌ ఆరో‌రాకి స్టార్డమ్‌ రాలేదు.‌© Sitara 2018.
Powered by WinRace Technologies.