ఒకే రోజు రెండు శుభవార్తలు

బాలీవుడ్‌ అగ్ర దర్శకుడు ఒకేరోజు రెండు శుభవార్తలు వినిపించాడు. నేటితో అక్షయ్‌కుమార్‌ను వదిలేసి త్వరలో అజయ్‌ దేవగణ్‌తో జట్టు కట్టబోతున్నట్లు తెలియజేశారు. అదేంటి.. అనుకుంటున్నారా? మరేం లేదు.. ప్రస్తుతం ఆయన అక్షయ్‌కుమార్‌తో కలిసి ‘సూర్యవంశీ’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఓ పవర్‌ఫుల్‌ పోలీస్‌ యాక్షన్‌ డ్రామా కథాంశంతో రూపొందిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ తాజాగా పూర్తయినట్లు ప్రకటించారు. ఈ శుభ సందర్భంలోనే రోహిత్‌ మరో తీపి కబురునూ వినిపించాడు. అజయ్‌ దేవగణ్‌తో కలిసి ‘గోల్‌మాల్‌ 5’ చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నట్లు ప్రకటించారు. ఇది వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలియజేశారు. ‘సూర్యవంశీ’ మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల హడావుడి ముగిశాకే అజయ్‌ చిత్రాన్ని పట్టాలెక్కించాలని ఆలోచన చేస్తున్నాడట.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.