వైవిధ్యమైన పాత్రలో ఆయుష్‌

హిందీలో విజయవంతమైన చిత్రాలకు చిరునామగా మారాడు ఆయుష్మాన్‌ ఖురానా. తాజాగా బట్టతల యువకుడిగా వచ్చి వసూళ్ల వర్షం కురిపిస్తున్నాడు. ఇప్పుడు తన మరో వైవిధ్యమైన సినిమా విడుదల తేదీని, ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశాడు. ఇందులో ఆయుష్మాన్‌ ఖురానా ‘గే’గా నటిస్తున్నాడు. 2017లో విడుదలైన ‘శుభ్‌ మంగల్‌ సావధాన’లో ఆయుష్మాన్‌ నటించాడు. విభిన్నమైన హాస్యభరిత కథనంతో తెరెక్కన ఈ చిత్రంలో పెళ్లెయిన ఓ అబ్బాయి తన భార్యతో ఎలా ప్రవర్తించేవాడు, అతను ఎదుర్కొన్న సమస్యలపై రూపొందిన చిత్రమే ఇది. ఇందులో భూమి ఫెడ్నేకర్‌ కథానాయిక. దీనికి సీక్వెల్‌గా రూపొందిన ‘శుభ్‌ మంగల్‌ జ్యాదా సావధాన్‌’ని 2020 ఫిబ్రవరి 21న విడుదల చేస్తున్నట్లు పోస్టర్‌ ద్వారా తెలిపారు దర్శకనిర్మాతలు. ఈ పోస్టర్‌లోని ఆయుష్మాన్‌ లుక్‌ నెటిజన్లని ఆకట్టుకుంటుంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.