జపాన్‌ వెళ్తున్న ‘అంధుడు’

మొన్న చైనా వెళ్లి వచ్చిన అంధుడు ఈ సారి జపాన్‌ వెళ్లడానికి తయారవుతున్నాడు. ఆయుష్మాన్‌ ఖురానా కథానాయకుడిగా రూపొందిన థ్రిల్లర్‌ చిత్రం ‘అంధాధున్‌’. ఇందులో అంధుడిగా నటించి మెప్పించాడు ఆయుష్‌. భారత్‌లో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న దీన్ని చైనాలో విడుదల చేస్తే 100 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ఇప్పుడు జపాన్‌లో విడుదలకు సిద్ధం అవుతోంది. నవంబర్‌ 15న ఇది జపాన్‌ ప్రేక్షకుల ముందుకు వెళ్లబోతోంది. ఇందులో సీనియర్‌ నాయిక టబు ఓ ముఖ్యపాత్ర పోషించింది. శ్రీరామ్‌ రాఘవన్‌ దర్శకుడు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.