‘బచ్చన్‌ పాండే’లో కృతి సనన్‌

బాలీవుడ్‌ నటి కృతి ససన్‌ మరోసారి అక్షయ్‌ కుమార్‌తో కలిసి నటించనుంది. ఈ మధ్యనే విడుదలైన ‘హౌస్‌ఫుల్‌4’ చిత్రం తరువాత అక్షయ్, కృతి సనన్‌ కలిసి ‘బచ్చన్‌ పాండే’లో నటిస్తున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ నదియాడ్‌వాలా గ్రాండ్‌ సన్‌ సంస్థ తన అధికారిక ట్విట్టర్లో తెలిపింది. ఇప్పుడు ‘బచ్చన్‌ పాండే’ చిత్రానికి కూడా ‘హౌస్‌ఫుల్‌4’ చిత్ర దర్శకుడు పర్హాద్‌ సమ్‌జీనే దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రధాన కథానాయిక పాత్రలో కృతి ససన్‌ నటిస్తోంది. చిత్రాన్ని వచ్చే క్రిస్మస్‌ పండుగ సమయానికి తెరపైకి తీసుకురానున్నారు. మొదట ఈ చిత్రానికి ‘ల్యాండ్‌ ఆఫ్‌ లుంగి’ అనే పేరును పెట్టారు. తిరిగి పేరును ‘బచ్చన్‌ పాండే’గా మార్చారట. సినిమాలో అక్షయ్‌ పాత్ర చాలా కరుకగా ఉండడంతో పాటు పోరాట సన్నివేశాలు కూడా ఎక్కువగా ఉండనున్నాయని సమాచారం. అక్షయ్‌ తమిళంలో మాట్లాడే సన్నివేశాలు కూడా ఉంటాయిట. తమిళంలో వచ్చిన ‘వీరమ్‌’ చిత్రానికిది రీమేక్‌. ఇంకా ఇందులో వర్ష బొల్లమ్మ, శరత్‌ సక్సేనా, విరేంద్రా సక్సేనా తదితరులు నటించనున్నారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.