డియోల్‌ బృందం హడావుడి మొదలు!

ధర్మేంద్ర డియోల్‌, సన్నీడియోల్‌, బాబీడియోల్‌ బృందం ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సీక్వెల్‌ చిత్రం ‘యమ్లా పగ్లా దీవానా ఫిర్‌సే’. ఈ బృందం తారాగణంగా 2013లో విడుదలైన యాక్షన్‌ కామెడీ ‘యమ్లా పగ్లా దీవానా’కి ఇది సీక్వెల్‌. సన్నీ సౌండ్స్‌, ఇంటర్‌ కట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ల పతాకంపై నవనీత్‌సింగ్‌ దర్శకత్వంలో రూపొందుతోంది. కీర్తి కర్‌బంధ, ఆస్రాని, సతీష్‌ కౌసిక్‌లు కథానాయికలు. తాజాగా ట్రైలర్‌ విడుదలైంది. డియోల్‌ బృందం మధ్య జరిగే సరదా సన్నివేశాలు, సన్నీడియోల్‌ నటించిన పోరాట సన్నివేశాలు ఆసక్తిని కలిగించేలా ఉన్నాయి. ప్రత్యేక ఆకర్షణగా ఓ గీతంలో సల్మాన్‌ఖాన్‌, నటి రేఖ కనువిందు చేస్తున్నారు. స్వరాలను సంజీవ్‌ దర్శన్‌, సచెట్‌ పరంపర, డిసౌజాలు అందించగా స్కోర్‌ను రాజు సింగ్‌ స్వరపరిచారు. ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ఛాయాగ్రహణం: జితన్‌ హర్‌మీట్‌, కూర్పు: మనీష్‌ మోర్‌.© Sitara 2018.
Powered by WinRace Technologies.