నయా కూలీ.. ఇలా జంటగా దర్శనమిచ్చాడు

‘హీరో నెం.1’, ‘జోడీ నెం.1’, ‘షాది నెం.1’ వంటి చిత్రాలతో దర్శకుడిగా బాలీవుడ్‌లో ఓ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారు డేవిడ్‌ ధావన్‌. ఇప్పుడాయన నుంచి రాబోతున్న తాజా చిత్రం ‘కూలీ.నెం.1’. వరుణ్‌ ధావన్, సారా అలీఖాన్‌ జంటగా నటించారు. 1995లో వచ్చిన గోవింద - కరిష్మా కపూర్‌ల ‘కూలీ.నెం.1’కి రీమేక్‌గా దీన్ని రూపొందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి తొలి లుక్‌ను విడుదల చేశారు. ఈ ఫొటోలో వరుణ్‌ - సారా రైల్వే ఫ్లాట్‌ఫారంపై ఒకరి చేతులు మరొకరు పట్టుకోని చిరునవ్వులు చిందిస్తూ చూడముచ్చటగా దర్శనమిచ్చారు. వరుణ్‌ ఎరుపు రంగు చొక్కాలో తలపై కండువా, చేతికి రైల్వే కూలీ బ్యాడ్జ్‌తో ఆకట్టుకునేలా కనిపించగా.. సారా తెలుపు రంగు చుడీదార్‌లో చాలా సహజంగా దర్శనమిచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారుతోంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని.. వచ్చే ఏడాది కార్మికుల దినోత్సవ కానుకగా మే1న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.