డ్రీమ్‌ గర్ల్ కోసం చీర కట్టిన ఆయుష్మాన్‌

ఈ మధ్యనే ప్రకటించిన 66వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ఉత్తమ నటుడిగా నిలిచారు ఆయుష్మాన్‌ ఖురానా. ‘అంధాధున్‌’ చిత్రంలో అంధుడిగా నటించి మెప్పించినందుకు ఆయనకు ఈ అవార్డు దక్కింది. ఇప్పుడు ఆయన మరో కొత్త తరహా పాత్ర పోషిస్తున్న చిత్రం ‘డ్రీమ్‌ గర్ల్‌’. ఓ చిన్న పట్టణానికి చెందిన యువకుడి పాత్రలో ఆయుష్మాన్‌ నటిస్తున్నాడు. వివిధ రకాల మహిళలకు సంబంధించిన గొంతులతో మాట్లాడటం అతడి ప్రత్యేకత. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని పోస్టర్‌లలో చీరకట్టులో కనిపించి అలరించాడు ఆయుష్మాన్‌. ముంబయిలో ఈ సినిమా ట్రైలర్‌ విడుదల వేడుకలో చీరకట్టులో వేదికపై కనిపించి అందర్నీ ఆకట్టుకున్నాడు. రాజ్‌ శాండిల్య తెరకెక్కిస్తున్న ఈ చిత్రం వచ్చే నెల 13న రానుంది.

Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.