ఆలోచింపజేస్తున్న‘గుమ్నామి’ ట్రైలర్‌

భారత స్వాతంత్ర్య వీరుడు సుభాస్‌ చంద్రబోస్‌ మరణానికి సంబంధించిన అంశంపై వస్తున్న చిత్రం ‘గుమ్నామి’. శ్రీజిత్‌ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ట్రైలర్‌ ఒకటి విడుదలైంది. బోస్‌ ఆగస్టు 18, 1945 న తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో సుభాస్ చంద్రబోస్ మరణించాడా? లేదా అనే దానిపై ఒక కమీషన్‌ కూడా వేశారు. ఉత్తర ప్రదేశ్ పట్టణమైన ఫైజాబాద్‌లో బోస్ పేరులేని పవిత్ర వ్యక్తిగా (గుమ్నామి బాబా అని పిలుస్తారు). ఈ వాదనను ప్రభుత్వ మద్దతుగల ముఖర్జీ కమిషన్ దర్యాప్తు చేసింది. ఫైజాబాద్‌లోని వ్యక్తి బోస్ కాదని డీఎన్‌ఏ అధ్యయనాలు తేల్చాయి. విమాన ప్రమాదంలో బోస్ మరణించలేదని కమిషన్ తేల్చింది. 2006లో, కమిషన్ నివేదిక యొక్క ఫలితాలను ప్రభుత్వం తిరస్కరించింది. శ్రీజిత్‌ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో ప్రొసేన్‌జిత్‌ ఛటర్జీ బోస్‌ పాత్రలో కనిపించారు. శ్రీ వెంకటేష్‌ ఫిలిమ్స్ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రానికి మహేంద్ర సోనీ, శ్రీకాంత్‌ మోత్తా నిర్మాతలు. పాత్రలో ప్రొసేన్‌జిత్‌  ఛటర్జీ నటించారు. అక్టోబర్‌ 2, 2019న బెంగాలి, హిందీ బాషల్లో తెరపైకి రానుంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.