వివాదంలో షారూఖ్‌ ‘జీరో’!!

షారుఖ్‌ ఖాన్‌ కథానాయకుడిగా నటిస్తూ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘జీరో’. ఆనంద్‌ ఎల్‌.రాయ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో షారుఖ్‌ ఓ మరుగుజ్జుగా కనిపిస్తాడు. అనుష్క శర్మ, కత్రినా కైఫ్‌ కథానాయికలుగా నటించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలవగా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. తాజాగా ఈ చిత్రం ఓ వివాదంలో చిక్కుకున్నట్లు బాలీవుడ్‌ మీడియా నుంచి సమాచారం అందుతోంది. ‘జీరో’లోని కొన్ని సన్నివేశాలు తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని.. దిల్లీ సిక్కు గురుద్వార్‌ కమిటీ జనరల్‌ సెక్రటరీ మజిందర్‌ సింగ్‌ పోలీస్‌లకు ఫిర్యాదు చేశారట. ఈ సందర్భంగా షారుఖ్‌తో పాటు చిత్ర దర్శకుడు ఆనంద్‌ ఎల్‌ రాయ్‌పైనా దిల్లీ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారని వార్తలొస్తున్నాయి. సిక్కులు ఎంతో పవిత్రంగా భావించే గట్రాకిర్పాన్‌ (చిన్న కత్తి)ను షారుఖ్‌ చిత్రంలో ధరించాడని.. సంప్రదాయం ప్రకారం అది అమృతధారి సిక్కులు మాత్రమే ధరించాలని సదరు వ్యక్తి ఫిర్యాదులో పేర్కొన్నాడట. సినిమాలోని ఆ సన్నివేశాలను తొలగించడంతో పాటు సిక్కులను అవమానించిన హీరో, దర్శకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరాడట. దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి స్పందన రాలేదు.© Sitara 2018.
Powered by WinRace Technologies.