అవన్నీ గాలి వార్తలే!

హృతిక్‌ రోషన్, టైగర్‌ ష్రాప్‌ కలిసి ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్‌ భామ దిశాపటానీ కూడా నటిస్తోంది. హృతిక్, దిశ మధ్య గొడవ జరగడంతో ఆమె సినిమా నుంచి తప్పుకుందంటూ వార్తలొస్తున్నాయి. దీనిపై టైగర్‌ స్పందించాడు. ‘‘అదో సిల్లీ రూమర్‌. ఈ వృత్తిలో ఇలాంటివి రావడం సహజం. హృతిక్‌ సారే కాదు ప్రతి నటుడికి ఇలాంటివి ఎదురవుతుంటాయి. ఇద్దరి గురించి నాకు బాగా తెలుసు. అలా గొడపడే వాళ్లు కాదు. ఇద్దరూ మంచి మనసున్న వ్యక్తులు’’ అని చెప్పాడు. ‘‘అవన్నీ బాధ్యతలేని వ్యక్తులు సృష్టించే పుకార్లు.. హృతిక్‌ చాలా మంచి వ్యక్తి’ అని దిశ స్పందించిన సంగతి తెలిసిందే. హృతిక్‌ తను నటించబోయే చిత్రం గురించి టైగర్‌ మాట్లాడుతూ ‘‘హృతిక్‌తో కలిపి పనిచేయడం ఎన్నో ఏళ్ల నా కల. ఆయన్ని మంచి నటుడిగానే కాదు... గొప్ప మనిషిగా ఆరాధించే వీరాభిమానిని నేను. ఆయన నుంచి ఎన్నో నేర్చుకున్నాను. ఆయనతో కలిసి నటించే సినిమా చిత్రీకరణ వచ్చే నెల్లో మొదలుకానుంది’’ అని చెప్పాడు. త్వరలో ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు టైగర్‌. ఇందులో ముద్దు సీన్లు వద్దు అనే నియమం పెట్టాడంటూ పుకార్లు వచ్చాయి. వాటి గురించి మాట్లాడుతూ ‘‘ఇది కేవలం పుకారే. నా ప్రతి చిత్రంలోనూ ముద్దు సన్నివేశాలు ఉంటాయి. వాటిలో ఎక్కడా నేను ఇబ్బంది పడలేదు. కథ కోరితే ముద్దు పెట్టుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు’’ అని చెప్పాడు టైగర్‌.© Sitara 2018.
Powered by WinRace Technologies.