ఆకట్టుకుంటున్న ‘వార్‌’ ఘుంగ్రూ సాంగ్‌

బాలీవుడ్‌ గ్రీక్‌గాడ్‌ హృతిక్‌ రోషన్, యాక్షన్‌ హీరో టైగర్‌ ష్రాఫ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భారీ యాక్షన్‌ చిత్రం ‘వార్‌’. వాణీ కపూర్‌ కథానాయిక. ‘బ్యాంగ్‌ బ్యాంగ్‌’ దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో హృతిక్, వాణీల మీద చిత్రీకరించిన ‘ఘుంగ్రూ..’ అంటూ సాగే బీచ్‌ పార్టీ వీడియో గీతాన్ని చిత్రబృందం విడుదల చేసింది. కనుల విందుగా తెరకెక్కించిన ఈ పాటలో హృతిక్, వాణి మధ్య కెమిస్ట్రీ, వారిద్దరి స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. వాణీ బికినీలో అందాలు ఆరబోస్తూ వేడెక్కించింది. పోల్‌ నుంచి వేలాడుతూ ప్రదర్శించిన అక్రోబాటిక్‌ భంగిమలు వహ్వా అనిపిస్తున్నాయి.  కుమార్‌ కలం నుంచి జాలువారిన ఈ పాటకి అరిజిత్‌ సింగ్‌, శిల్పారావులు గొంతులు ఆలపించాయి. ఈ పాటకి బోస్కో, సీజర్‌, తుషార్‌ కలియాలు కొరియాగ్రఫీ అందించారు.  ఇటలీలోని సుందరమైన అమల్ఫీ తీర ప్రాంతంలో చిత్రీకరించిన తొలి బాలీవుడ్‌ పాట ఇదే కావడం గమనార్హం. యష్‌రాజ్‌ ఫిలింస్‌ నిర్మించిన ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ భాషల్లో అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.  Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.