సల్మాన్‌ - షారుఖ్‌.. ఇషాఖ్‌బాజీ!!షారుఖ్‌ ఖాన్‌ మరుగుజ్జు పాత్రలో తొలిసారి నటిస్తోన్న చిత్రం ‘జీరో’. ఆనంద్‌ ఎల్‌.రాయ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని.. షారుఖ్‌ సతీమణి గౌరీ ఖాన్‌ నిర్మిస్తున్నారు. కత్రినా కైఫ్, అనుష్క శర్మ కథానాయికలుగా నటిస్తున్నారు. సల్మాన్‌ ఖాన్, కాజోల్, రాణీ ముఖర్జీ, శ్రీదేవి, ఆలియా భట్, దీపికా పదుకొణె కరిష్మా కపూర్‌ తదితరులు అతిథి పాత్రల్లో మెరవబోతున్నారు. డిసెంబరు 21 ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్లో భాగంగా షారుఖ్‌ - సల్మాన్‌లపై చిత్రీకరించిన ‘ఇషాఖ్‌బాజీ’ గీతాన్ని విడుదల చేశారు. ఈ పాట ఆద్యంతం కత్రినా చుట్టూనే తిరుగుతుంది. ఇందులో కత్రినా ప్రేమను పొందడం కోసం షారుఖ్‌ - సల్మాన్‌ పోటీపడుతూ కనిపించారు. ‘‘తనని నేను గాఢంగా ప్రేమిస్తున్నాను’’ అని షారుఖ్‌ అంటే.. ‘‘తను నన్ను గాఢంగా ప్రేమిస్తోంది’’ అంటూ సలల్మాన్‌ పాట రూపంలో బదులివ్వడం ఆకట్టుకుంది. ఇలా అగ్రతారలిద్దరూ కత్రినా ప్రేమ కోసం హుషారుగా ఆడిపాడుతూ కనిపించారు. ఈ గీతానికి గణేశ్‌ ఆచార్య నృత్యరీతులు సమకూర్చగా.. అజయ్‌ అతుల్‌ స్వరాలు అందించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు మంచి ఆదరణ లభించిన నేపథ్యంలో సినిమాపై మంచి అంచనాలేర్పడ్డాయి.© Sitara 2018.
Powered by WinRace Technologies.