మలైకా ఆటాపాటా లేనట్టే

సల్మాన్‌ఖాన్‌ నటించిన మెప్పించిన చిత్రం ‘దబాంగ్‌’. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ఇప్పటికే ‘దబాంగ్‌2’ కూడా వచ్చేసింది. ఇక మూడో సీక్వెల్‌గా ‘దబాంగ్‌3’ తెరకెక్కనుంది. ఇప్పటి వరకు వచ్చిన ఐటెమ్‌ సాంగ్స్‌ అదరగొట్టేశాయి. మొదటి ‘దబాంగ్‌’లో ‘మున్నీ బదనామ్‌ హోయ్‌’ అంటూ తెగ సందడి చేసింది మలైకా అరోరా. త్వరలో తెరకెక్కనున్న ‘దబాంగ్‌3’లో ఐటెమ్‌ భామగా మలైకా అరోరా నటించడం లేదని సమాచారం. ఇప్పుడు ఆ స్థానంలో కరీనాకపూర్‌ ఆడిపాడనుందట. కరీనాకపూర్‌ కూడా ‘దబాంగ్‌2’లో ‘ఫెవికోల్‌ సే’ అనే ఐటెమ్‌ పాటలో సల్మాన్, అర్బాజ్‌ఖాన్లతో కలిసి స్టెప్పులేసిన సంగతి తెలిసిందే. మొదట్లో ‘దబాంగ్‌3’లో మలైకానే అనుకున్నారట. కానీ సల్మాన్‌ సోదరుడు అర్బాజ్‌ఖాన్‌తో విడిపోయాక వారి మధ్య సత్సంబంధాలు లేకపోవడంతోనే మలైకా ఐటెమ్‌ సాంగ్‌లో నటించట్లేదని సినీ వర్గాల నుంచి వినిపిస్తున్న వార్త. అందులోను ఈ చిత్రానికి నిర్మాత అర్బాజ్‌ఖాన్‌ కావడం మరో కారణం. ముచ్చటగా మూడోసారి వస్తున్న ‘దబాంగ్‌3’లో మలైకా అరోరా సాంగ్‌ ఉండదనేది ఖరారే.





Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.