్జమరో ‘మున్నాభాయ్‌’ వస్తున్నాడా?

‘రోగిని ప్రేమించలేని డాక్టర్‌ కూడా రోగితో సమానం’, ‘బాపు ఏం చెప్పాడు, ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించమన్నాడు’.. ఈ డైలాగ్స్‌ ఏ సినిమాల్లోవి అని అడిగితే ‘శంకర్‌దాదా ఎమ్‌బీబీఎస్, జిందాబాద్‌’ అని చెప్తేస్తాం. అంతగా ఆ డైలాగ్స్‌ ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలకి మూలం సంజయ్‌ దత్‌ ‘మున్నాభాయ్‌ ఎమ్‌బీబీఎస్‌’, ‘మున్నాభాయ్‌ లగేరహో’ అనే విషయం తెలిసిందే. ప్రసుత్తం వీటికి కొనసాగింపుగా ‘మున్నాభాయ్‌ 3’ను ప్లాన్‌ చేస్తున్నారని హిందీ వర్గాల టాక్‌. వ్యవస్థలో ఉన్న లోపాల్నే తన సినిమా కథా వస్తువుగా తీసుకుంటారు దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరానీ. ఆయన గత చిత్రాలన్నీ ఈ పంథాలోనే సాగాయి. మరి ఈ సినిమాతో ఎటువంటి సందేశం ఇస్తారనేది వేచి చూడాలి. ఈ సినిమాను కూడా గత చిత్రాల్లాగా తెలుగులో చిరు నటిస్తారేమో అనే ఆసక్తి ఇప్పటి నుంచే మొదలైంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.