హాస్యాన్ని పండించడం అంత సులువు కాదు!
                             

‘‘ఈ రోజుల్లో చాలా మంది హాస్య చిత్రాలు చేయడం పెద్ద కష్టం కాదు. కామెడీకి మెదడును పెద్దగా వాడాల్సిన అవసరం లేదని అంటున్నారు. కానీ అది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే అలా నవ్వించడానికి ఆ నటుడు ఎంత కష్టపడాలో మాకు తెలుసు’’ అంటున్నాడు బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం ‘టోటల్‌ ధమాల్‌’. ఫిబ్రవరి 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా అజయ్‌ దేవగణ్‌ మాట్లాడుతూ.. ‘‘ప్రపంచంలో నవ్వించే సినిమాలకి చాలా ఆదరణ ఉంది. వీటిని వేరే సినిమాలతో పొల్చి చూడాల్సిన అవసరం లేదు. అసలు నవ్వించడమంటే వారి ఎదుటివారి బాధను పొగొట్టడమే. తొలుత ఈ చిత్ర కథ విన్నప్పుడు చాలా ఫన్నిగా అనిపించింది. షూటింగ్‌ సమయంలో నా తోపాటు మాధురీ దీక్షిత్, అనిల్‌కపూర్, జావేద్‌ జఫ్రీ, రితేష్‌ దేశ్‌ముఖ్‌ ప్రతి సన్నివేశానికి నవ్వుకోవడమే. అలాగని ఎక్కడా ఈ చిత్రంలో కామెడీని వెటకారం చేయలేదు. రెండు బ్యాలెన్స్‌గా చేశామని’’ చెబుతున్నారు. అజయ్‌ దేవగణ్‌ ఫిల్మ్స్, ఫాక్స్‌స్టార్‌ స్టూడియోస్, పెన్‌ ఇండియా లిమిటెడ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రానికి ఇంద్రకుమార్‌ దర్శకుడు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.