వాళ్లకు కావల్సింది ఇస్తేనే..
ప్రియాంక చోప్రా నటిగానే కాదు గాయకురాలు, నిర్మాతగానూ సత్తా చాటుతోంది. హాలీవుడ్‌లో అడుగుపెట్టి ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న ఈ కథానాయికకు మెగాఫోన్‌ పట్టుకోవడం అంటే కాస్త భయంగా ఉందట. మరి ఇన్ని చేసి దర్శకత్వం చేయడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు? అంటే ‘‘నటన, పాటలు పాడటం, చిత్ర నిర్మాణంలో విజయం సాధించాను. కానీ దర్శకత్వం అంటే మాటలు కాదు. ఎన్నో బాధ్యతలతో కూడిన వ్యవహారమది. అందుకే దర్శకత్వం అంటే కంగారొస్తుంది. అయితే భవిష్యత్తులో డైరెక్షన్‌ చేస్తానేమో అనిపిస్తుంది. ఎందుకంటే నేను నటనకే పరిమితమవుతానేమో అనుకున్నా కానీ ఆ తర్వాత నిర్మాతగా మారాను. అలాగే డైరెక్షన్‌ కూడా చేస్తానేమో’’ అంటోంది ప్రియాంక.

ప్రేక్షకులకు కావాల్సింది ఇస్తేనే..!
‘‘ప్రేక్షకులు మారిపోయారు. సినిమా నుంచి వాళ్లు కోరుకునే అంశాలు కూడా మారిపోయాయి. ప్రేక్షకులకు ఏమి ఏం కావాలో అది ఇవ్వడమే మన పని’’ అంటోంది ప్రియాంక చోప్రా. ‘‘ఇప్పుడు ఎక్కువగా ఎలాంటి చిత్రాలు ప్రేక్షకాదరణ పొందుతున్నాయో చూస్తునే ఉన్నాం. అన్నీ మాస్‌ మసాలా చిత్రాలే ఆడటం లేదు. కథ బలంగా ఉన్న కొత్త కాన్సెప్ట్‌ చిత్రాలే ప్రేక్షకుల్ని థియేటర్‌కు రప్పిస్తున్నాయి. అలాంటి చిత్రాల దిశగా బలమైన అడుగులు పడుతున్నాయి’’ అని చెప్పింది ప్రియాంక.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.