‘సింబా’ ట్రైలర్‌ వచ్చేస్తోంది..
రణ్‌వీర్‌ సింగ్‌ కథానాయకుడిగా రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సింబా’. తెలుగులో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఎన్టీఆర్‌ ‘టెంపర్‌’ చిత్రానికి హిందీ రీమేక్‌ ఇది. ఇందులో రణ్‌వీర్‌ పోలీస్‌ అధికారిగా కనిపించబోతున్నాడు. అతనికి జోడీగా సైఫ్‌ అలీఖాన్‌ తనయ సారా అలీఖాన్‌ కనిపిస్తుంది. రోహిత్‌ శెట్టి, కరణ్‌ జోహార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే గోవాలో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. తాజాగా గోవాలో జరిగిన ఈ చివరి షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తయిందట. డిసెంబరు 3న చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమా క్లైమాక్స్‌లో అజయ్‌ దేవ్‌గణ్‌ అతిథి పాత్రలో తళుక్కున మెరవబోతున్నాడట. నూతన సంవత్సర కానుకగా.. డిసెంబరు 28న సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.© Sitara 2018.
Powered by WinRace Technologies.