సైనికాధికారిగా మారబోతున్న వరుణ్‌
బాలీవుడ్‌ కథానాయకుడు వరుణ్‌ ధావన్‌ ఓ బయోపిక్‌లో నటించడానికి సిద్ధమయ్యారు. తనతో ‘బద్లాపూర్‌’ చిత్రాన్ని తెరకెక్కించిన శ్రీరామ్‌ రాఘవన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. తన ధైర్య సాహసాలతో భారత ప్రభుత్వం నుంచి పరమవీర చక్ర పురస్కారం అందుకున్న సైనికాధికారి అరుణ్‌ ఖెతర్‌పాల్‌ జీవితకథతో ఈ చిత్రం తెరకెక్కనుంది. 1971 భారత్‌-పాక్‌ యుద్ధంలో శత్రు సైనికులను చీల్చిచెండాడుతూ 21 ఏళ్లకే వీరమరణం పొందారు అరుణ్‌. ఆయన పాత్రలో వరుణ్‌ నటించనున్నారు. ఇంకా పేరు ఖరారు చేయని ఈ చిత్రంలో ఇతర తారాగణం వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. కాగా వరుణ్‌ ప్రస్తుతం ‘కూలీ నెం.1’లో నటిస్తున్నారు. వరుణ్‌ తండ్రి డేవిడ్‌ ధావన్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సారా అలీఖాన్‌ కథానాయిక. వచ్చే మేలో ఈ చిత్రం విడుదల కానుంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.