ఆటకైనా.. వేటకైనా రెడీ

బాలీవుడ్‌ స్టార్‌ కథానాయకుడు సల్మాన్‌ ఖాన్‌ చుల్‌బుల్‌ పాండేగా ‘దబంగ్‌ 3’ చిత్రంలో కనిపించనున్నాడు. ప్రముఖ కొరియోగ్రాఫర్‌, దర్శకుడు ప్రభుదేవా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం హిందీ,కన్నడ, తమిళ్‌, తెలుగు భాషల్లోనూ రిలీజ్‌ చేస్తున్నారు. అంతేకాదు 2019 డిసెంబరు 20 విడుదల తేదీగా ప్రకటించింది చిత్ర బృందం. మరో వందరోజుల్లో ‘దబంగ్‌ 3’ అంటూ ఆసక్తి పెంచేశారు. తాజాగా ఇందుకు సంబంధించి మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో సల్మాన్‌ సీరియస్‌గా నడుచుకుంటూ వస్తూ చెప్పే ‘ఆటకైనా వేటకైనా రెడీ’ డైలాగ్ సినిమాపై అంచనాలు పెంచుతుంది. సల్మాన్‌ ఖాన్‌, అర్బాజ్‌ ఖాన్‌, నిఖిల్‌ ద్వివేది సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా కథానాయిక.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.