సందీప్‌.. ఈసారి అన్ని భాషలపై గురిపెట్టాడుగా..

ఇటీవల కాలంలో తెలుగు చిత్రసీమ నుంచి బాలీవుడ్‌లోకి వెళ్లి, తొలి ప్రయత్నంలోనే అక్కడ సత్తా చాటిన అతికొద్ది మంది దర్శకుల్లో సందీప్‌ రెడ్డి వంగా ఒకరు. తెలుగు ట్రెండ్‌ సెట్టర్‌ హిట్‌గా నిలిచిన తన ‘అర్జున్‌రెడ్డి’ చిత్రాన్నే హిందీలో్ ‘కబీర్‌సింగ్‌’గా రీమేక్‌ చేసి భారీ విజయాన్నిఖాతాలో వేసుకున్నారు. తొలి సినిమాతోనే రూ.300 కోట్లు కొల్లగొట్టిన దర్శకుడిగా అరుదైన ఖ్యాతి దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో సందీప్‌ నుంచి రాబోయే తర్వాతి చిత్రంపై అటు ఉత్తరాది, ఇటు దక్షిణాది ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇదిలా ఉండగా తాజాగా సందీప్ తన కొత్త చిత్ర కబురును వినిపించేశాడు. త్వరలో ఓ సరికొత్త క్రైమ్‌ డ్రామా కథతో తన కొత్త సినిమాను పట్టాలెక్కించబోతున్నట్లు ప్రకటించారు. తన తొలి బాలీవుడ్‌ చిత్రం ‘కబీర్‌ సింగ్‌’ను నిర్మించిన భూషణ్‌ కుమార్‌, మురాద్‌ ఖేతానిలతో కలిసి ఈ చిత్రాన్ని సొంత బ్యానర్‌లో తెరకెక్కించబోతున్నట్లు తెలియజేశారు. దీన్ని ప్యాన్‌ ఇండియా చిత్రంగా రూపొందించబోతున్నారట సందీప్‌. ఈ ప్రాజెక్టులో నటించబోయే కథానాయకుడు ఎవరు? ఇతర నటీనటులు, సాంకేతిక సిబ్బంది వివరాలను త్వరలోనే తెలియజేయనున్నట్లు తెలియజేశారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.