అలియాను ఖరారు చేసిన సంజయ్‌

బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ ‘గంగుబాయి’ చిత్రం తెరకెక్కిస్తున్నారనే విషయం తెలిసిందే. కథానాయిక ఎవరనే విషయంలో రకాలరకాల ఊహాగానాలు వినిపించాయి. ప్రారంభంలో ప్రియాంక చోప్రా నటిస్తోందంటూ వార్తలొచ్చాయి. తర్వాత అలియా పేరు వినిపించింది. అయితే ఇప్పటి వరకు ఈ విషయంపై సంజయ్‌ స్పందించకపోవడంతో ఈ సినిమాలో ఎవరు నటిస్తారో అని సందేహం అందరిలోనూ ఉండేది. తాజాగా ఈ చిత్రంలో అలియా ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం. అంతేకాదు విడుదల తేదీని ప్రకటించారు. 2020 సెప్టెంబరు 11న విడుదల చేయనున్నారు. భన్సాలీ ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మితమవుతోందీ చిత్రం. ‘మాఫియా క్వీన్స్‌ ఆఫ్‌ ముంబయి’ నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ త్వరలోనే మొదలవుతుంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.