షారుఖ్‌ - అట్లీ.. కొత్త చిత్ర టైటిల్ ఇదేనట!!

కింగ్‌ ఖాన్‌ షారుఖ్‌కి దక్షిణాది సినీ పరిశ్రమ మీద చాలా ప్రేమ. ఎందుకంటే తను కష్లాల్లో ఉన్నప్పుడు రికార్డులు బద్దలుకొడుతూ తిరుగులేని విజయాన్ని అందించింది ‘చెన్నయ్‌ ఎక్స్‌ప్రెస్‌’. ఇప్పుడు అలాంటి విజయమే లక్ష్యంగా తన నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ను ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీతో చేయబోతున్నట్లు బాలీవుడ్‌ టాక్‌. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఏదీ రానప్పటికీ ఈ ప్రాజెక్టు పక్కా అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా మరో ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఈ చిత్రానికి ‘సంఖీ’ అనే టైటిల్‌ను ఖరారు చేసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన షారుఖ్‌ పుట్టినరోజు సందర్భంగా నవంబరు 2న వెలువడనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అట్లీ 180 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ‘బిగిల్‌’ చిత్రం దీపావళీ కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. దీనికి అటు తమిళ్‌లో ఇటు తెలుగులో ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కుతోంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.