టబు - ఇషాన్‌ల కొత్త చిత్రం!

ప్రముఖ బాలీవుడ్‌ దర్శకురాలు మీరా నాయర్‌ అంటేనే వైవిధ్యతకు మారు పేరు. నాయర్‌ దర్శకత్వంలో ప్రముఖ బాలీవుడ్‌ నటి టబు, రెండు చిత్రాలతోనే ప్రత్యేకశైలిని సంపాదించుకున్న నటుడు ఇషాన్‌ ఖట్టర్‌ ఓ కొత్త చిత్రంలో నటించనున్నారు. చిత్రం పేరు ‘ఏ సూటబల్‌ బాయ్‌’. ప్రముఖ రచయిత విక్రమ్‌ సేథ్‌ అంటే తెలియని వారుండరు. ఆయన రచించిన నవల పేరే ‘ఏ సూటబుల్‌ బాయ్‌’. లతా అనే ఒక విద్యార్థిని అప్పుడే విశ్వవిద్యాలయంలో చదువుకొని బయటకు వస్తుంది. అవి 1951 నాటి రోజులు. లత ఏం చేసినా సొంతంగా చేయాలనే ఆలోచనలు గల వ్యక్తి. ఆత్మవిశ్వాసం ఎక్కువ ఆమె వివాహానికి తన తోబుట్టులతో ముడిపడి ఉంటుంది. మాన్‌ కపూర్‌ చెంచల మనస్తత్వం గలవాడు. అనుకోకుండా అతనికి సయిదా బాయి అనే వేశ్య పరిచయం అవుతుంది. ఆ తరువాత ఏం జరిగిందనేది చిత్రంలోని కథ. ఇషాన్‌ ఖట్టర్‌ మాన్‌ కపూర్‌గా, టబు వేశ్యపాత్ర అయిన సయిదా బాయిగా నటిస్తుంది. లతా పాత్రలో తాన్య అనిక్తల నటిస్తున్నారు. వచ్చే నెల్లోనే చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. షూటింగ్‌ ఎక్కువ భాగం లక్నోలోని రాజభవనాల్లోను, మహేశ్వర్‌ ప్రాంతాల్లోనే తీయనున్నారట. టబు గతంలో మీరా నాయర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ది నామ్‌సేక్‌’లో ఆషిమా గంగూలి పాత్రలో నటించింది. ఇషాన్‌ ఖట్టర్‌ జాన్వీకపూర్‌తో కలిసి ‘ధడక్‌’ చిత్రంలో చేశాడు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.