భార్యాభర్తల అనుబంధం ‘ది స్కై ఈజ్‌ పింక్‌’

ప్రియాంక చోప్రా, ఫర్హాన్‌ అక్తర్‌ భార్యాభర్తలుగా నటిస్తున్న చిత్రం ‘ది స్కై ఈజ్‌ పింక్‌’. ఆర్‌ఎస్‌వీపీ మూవీస్‌ - రాయ్‌ కపూర్‌ ఫిల్మ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సోనాలీ బోస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ ఒకటి విడుదలైంది. చిత్ర కథంతా ప్రేమ మరియ ఆశల మధ్యనే తిరుగుతుంది. ఇందులో ప్రియాంక అదితి చౌధరిగా, ఫర్హాన్‌ అక్తర్‌ నిరేన్‌ చౌధరిలుగా నటిస్తున్నారు. ఈ ముచ్చటైన జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉంటారు. ఇందులో జైరా వసీం ఐషా ఛౌధరిగా నటిస్తుంది. ఊపిరి తిత్తుల వ్యాధితో పోరాడుతన్న (ఐషా) బాధిరాలిగా వసీం నటిస్తుంది. విడుదలైన ట్రైలర్లో ఫర్హాన్‌ - ప్రియాంకలు యువ్వన దశ నుంచి వృద్ధాప్యం వరకు పోషించిన పాత్రలు కూడా కనిపిస్తున్నాయి. ఈ చిత్ర కథంతా ధిల్లీకి చెందిన ఐషా నిజ జీవితంలో జరిగిన యాదార్థ సంఘటన స్ఫూర్తితోనే చిత్ర కథను తెరకెక్కించారు. ఇండియాలో అక్టోబర్‌ 11, 2019 విడుదల తెరపైకి వస్తుంది. ఇక మరో విశేషం ఏమిటంటే ఈనెల్లో (సెప్టెంబర్‌ 13న) టోరంటోలో జరిగే అంతర్జాతీయ చలనచిత్ర వేడుకలో ఈ చిత్రం ప్రదర్శితం కానుంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.