‘ది వెడ్డింగ్‌ గెస్ట్‌’లో దేవ్‌ పటేల్‌ ఏం చేశాడు!

ఇండియాకు చెందిన అంతర్జాతీయ నటుడు దేవ్‌ పటేల్‌ నటిస్తున్న చిత్రం ‘ది వెడింగ్‌ గెస్ట్‌’. ఈ చిత్రానికి మైకేల్‌ వింటర్‌బాటమ్‌ దర్శకుడు. దేవ్‌ పటేల్‌ ఇందులో బ్రిటన్‌ ముస్లిం యువకుడిగా నటిస్తున్నారు. అతను బ్రిటన్‌ నుంచి పాకిస్తాన్, ఇండియాలకు ఎందుకు వచ్చాడు అనేది కథ. ఇందులో రాధికా ఆప్టే సమీరా అనే పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ ఒకటి విడుదలైంది. ఆ ట్రైలర్‌లో దేవ్‌ ముందుగా ఓ కారులో బయలు దేరుతాడు. ఆ ప్రయాణంలోనే రాధికా (సమీరా)ను చూస్తాడు. తరువాత కిడ్నాప్‌ చేస్తాడు. ఇద్దరూ కలిసి గోవాకు వెళ్లడం. తరువాత వారి పాస్‌పోర్టులను పోలీసులు సోదా చేయడంలాంటి థ్రిల్లింగ్‌ విషయాలు ట్రైలర్‌లో చూడవచ్చు. వీరితో పాటు మరో నటుడు చెందిన జిమ్‌ సరబ్‌ కూడా ఇందులో నటిస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్‌ 8న, టోరంటో ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఈ చిత్రాన్నిప్రదర్శించారు. అక్కడ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలనే దక్కించుకొంది ఈ చిత్రం. నిక్‌ బోయర్, దీపక్‌ నాయర్‌ నిర్మాతలు. యాక్షన్, మిస్టీరియ్‌ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ చిత్రం మార్చి 1, 2019న తెరపైకి రానుంది.






Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.