‘స్ట్రీట్‌ డ్యాన్సర్‌’ ఫస్ట్‌ లుక్‌

వరుణ్‌ధావన్, శ్రద్థాకపూర్‌లు జంటగా నటిస్తున్న చిత్రం ‘స్ట్రీట్‌ డ్యాన్సర్‌’. ఉపశీర్షిక ‘రూల్‌ బ్రేకర్స్‌’. రెమో డిసౌజా దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ సినిమాలో వరుణ్‌ధావన్‌ పంజాబ్‌కు చెందిన ఓ సాధారణ నృత్యకారుడి పాత్రలో నటిస్తుండగా, శ్రద్ధ పాకిస్థాన్‌కు చెందిన నృత్యకారిణి, మరో కీలకపాత్రలో నోరాఫతేహి నటిస్తోంది. వీరి ముగ్గురు మధ్య ఏం జరిగిందన్నదే కథాంశం. త్రీడీ ఫార్మాట్‌లో రూపొందుతోందీ సినిమా. తాజాగా ఫస్ట్‌లుక్‌ను వరుణ్, శ్రధ్థాలు ఇస్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.‘‘మేం ముగ్గురం రూల్స్‌ బ్రేక్‌ చేసేందుకు నవంబర్‌ 8న వస్తున్నాం. మీరూ సిద్ధమేనా?’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాశారు. ఫస్ట్‌ లుక్‌లో వరుణ్‌ డిఫరెంట్‌గా కనిపిస్తున్నారు.



View this post on Instagram

A post shared by Varun Dhawan (@varundvn) on

View this post on Instagram

A post shared by Varun Dhawan (@varundvn) on



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.