ప్రేరేపించిన ‘దెయ్యం’ కథ

బాలీవుడ్‌లో అందరి దర్శకుల్లా కాకుండా తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఎర్పరుచుకున్నవాడు విక్రమ్‌ భట్‌. ప్రస్తుతం విక్రమ్‌ హర్రర్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో ‘ఘోస్ట్‌’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అమెరికాలో జరిగిన ఓ యాదార్థ సంఘటనను ఆధారంగా తీసుకొని తెరకెక్కిస్తున్నారు. సినిమా కోసం దర్శకుడు సమగ్రమైన సమాచారం సేకరించడంతో పాటు కథపై పరిశోధన కూడా చేశాడట. ప్రధాన పాత్రల్లో సనయ ఇరానీ, శివమ్‌ భార్గవ్‌లు నటిస్తున్నారు. సినిమా మొత్తం కేవలం మూడు ప్రాతలతోనే నడువనుందని సమాచారం. పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్, వసూ భగ్నానీ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి సంజీవ్‌ - దర్శన్, ఆర్కో పార్వో, సోనాల్‌ ప్రధాన్, వినయ్‌ రామ్‌ తివారిలు సంగీతం అందిస్తున్నారు. అక్టోబర్‌ 18, 2019న తెరపైకి రానుంది. గతంలో విక్రమ్‌ ‘డేంజరస్‌ ఇష్క్‌’, ‘రాజ్‌ రిభూత్‌’, ‘హన్టెడ్‌: 3డి’లాంటి చిత్రాలకు దర్శకత్వం వవహించారు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.