అజయ్‌ జంటగా కీర్తిసురేష్‌

అలనాటి అందాల నటి సావిత్రి బయోపిక్‌ ‘మహానటి’లో నటించిన కీర్తి సురేష్‌కు బాలీవుడ్‌ స్వాగతం పలికింది. అజయ్‌ దేవగన్‌ కథనాయకుడిగా అమిత్‌ శర్మ దర్శకత్వంలో రూపొందే సినిమాలో అవకాశం లభించింది. పుట్‌బాల్‌ కోచ్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రహీం కథను తెరకెక్కిస్తున్నారు. ఇందులో అజయ్‌ సరసన కీర్తి నటిస్తోంది. చిత్రం జూన్‌లో సెట్స్‌పైకి వెళ్లబోతోంది. ప్రధాన పాత్రల్లో ఆకాశ్‌చావ్లా, అరునవ జాయ్‌సేన్‌ గుప్తా నటిస్తున్నారు. బోనీకపూర్‌ చిత్ర నిర్మాత.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.