రామ్‌సే బ్రదర్స్‌ బయోపిక్‌!

బాలీవుడ్‌ హారర్‌ చిత్రాల మార్గదర్శకులైన రామ్‌సే బ్రదర్స్‌ జీవితాధారంగా ఓ చిత్రం తియ్యనున్నారు. రామ్‌సే బ్రదర్స్‌ బయోపిక్‌ని నటుడు అజయ్‌ దేవగణ్‌ నిర్మించనున్నారని సమాచారం. అజయ్‌ నటుడిగా, నిర్మాతగా తన వ్యవహారాల్లో బిజీగా ఉన్నారు. అయినా రామ్‌సే బ్రదర్స్‌ బయోపిక్‌ని నిర్మించాలని అనుకుంటున్నారట. ఇక ఇప్పటికే కథకు సంబంధించిన హక్కులను ప్రీతి సిన్హా సొంతం చేసుకున్నారు. ఈమె నిర్మాత వినయ్‌ సిన్హాకి కూతురు. వీరిద్దరు కలిసి నిర్మించనున్న ప్రాజెక్టు గురించి ప్రీతి మాట్లాడుతూ.. ‘‘రామ్‌సే బ్రదర్స్‌ కుటుంబ సభ్యులు మాపై నమ్మకంతో బయోపిక్‌ హక్కులను మాకివ్వడం చాలా సంతోషంగా ఉంది. వారి నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సడలనివ్వం. బాలీవుడ్‌లో హరర్‌ చిత్రాలకు నాంది పలికిన రామ్‌సే బ్రదర్స్‌ కృషిని అజయ్‌ దేవగణ్, నేను తప్పకుండా నెరవేరుస్తామని’’ చెప్పింది. ఈ మధ్యనే రామ్‌సే బ్రదర్స్‌లో ఒకరైన శ్యామ్‌ రామ్‌సే అనారోగ్యంతో చనిపోయిన సంగతి తెలిసిందే! రామ్‌సే బ్రదర్స్‌ తెరకెక్కించిన ‘దో గాజ్‌ జమీన్‌ కె నీచే’, ‘గౌస్ట్‌ హుస్‌’, ‘వీర్నా’, ‘పురాణ మందిర్‌’, ‘పురాణ హవేలి’లాంటి చిత్రాలతో ప్రేక్షకుల్ని భయపెట్టారు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.