మూడో సెంచరీ కొట్టిన ఆయుష్‌

ఆయుష్మాన్‌ ఖురానా.. ఇప్పుడీ పేరు హిందీ చిత్ర పరిశ్రమలో వైవిధ్యభరిత కథలకు చిరునామ. ‘విక్కి డోనర్‌’ చిత్రంతో ఈ తరహా ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఆయుష్‌ సినీ ప్రియులని మెప్పిస్తూ అక్కడి నుంచి అదే బాటను తన రహదారిగా మార్చుకున్నాడు. ఇదే క్రమంలో ‘బదాయి హో’, ‘డ్రీమ్‌ గర్ల్‌’ చిత్రాలతో బాక్సాఫీస్‌ దగ్గర వంద కోట్లు వసూళ్లు చేశాడు. ఇప్పుడు తాజాగా బట్టతల యువకుడికి వచ్చే సమస్యల నేపథ్యంతో తెరకెక్కిన హాస్యభరితమైన సినిమా ‘బాలా’తో మరోసారి వంద కోట్ల క్లబ్‌లోకి చేరాడు. అతి తక్కువ సమయంలోనే ‘బాలా’ ఈ మైలురాయిని సాధించింది. ప్రస్తుతం ‘బాలా’ జోరు చూస్తుంటే బాక్సాఫీస్‌ దగ్గర మరిన్ని రికార్డులను నెలకొల్పే అవకాశం ఉందని సినీ ట్రేడ్‌ వర్గాల అంచనా.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.