బాలీవుడ్లో హిట్ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకొన్న జంట రణబీర్ కపూర్, దీపికా పదుకొనే. వీరిద్దరు కలిసి నటించిన సినిమాలు విజయవంతమయ్యాయి. వీరిద్దరు మరోసారి జంటగా కనిపించబోతున్నారు. ఓ వాణిజ్య ప్రకటనలో నటిస్తున్నారు. ప్రసుతం ఇది చిత్రీకరణ జరుపుకొంటోంది. గతేడాది ఏప్రిల్‌లో జరిగిన ఫ్యాషన్‌షోలో వీరిద్దరూ కలిసి ర్యాంప్ వాక్ చేశారు. ఈ కార్యక్రమం నటి షబానా అజ్మికి చెందిన స్వచ్చంద సంస్థ, మిజ్వాన్ వెల్ఫేర్ సొసైటీల ఆధ్వర్యంలో ఏర్పాటయింది. ప్రస్తుతం దీపిక..మేఘన గుల్జార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఛప్పక్’లో నటిస్తోంది. ఇది యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతోంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘బహ్మాస్త్ర’ చిత్రంలో రణబీర్Â నటిస్తున్నారు. ఇందులో ఆయనకు జోడీగా ఆలియాభట్ నటిస్తోంది.
