అవును ఆమె కథను రాస్తున్నా

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌గా పేరు తెచ్చుకొన్న నటి కంగనా రనౌత్‌. త్వరలో ఆమె జీవితకథ సినిమాగా రాబోతోంది. ఇందుకు సంబంధించి కథను రచయిత విజయేంద్ర ప్రసాద్‌ సిద్ధం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన ఓ మీడియాకిచ్చిన ముఖాముఖిలో వెల్లడించారు. ‘‘అవును. ఆమె జీవిత కథను మాత్రమే రాస్తున్నా, దర్శకుడిని నేను’’ కాదని చెప్పారు. గతంలో ఆయన రాసిన ‘భజరంగీ భాయ్‌జాన్‌’, ‘బాహుబలి’ కథలు చిత్రాలుగా రూపొంది ప్రపంచ వ్యాప్తంగా భారతీయ సినిమా స్థాయిని పెంచాయి. ఇటీవల కంగనా కథనాయికగా వచ్చిన ‘మణికర్ణిక’ చిత్రానికి కూడా కథను ఆయనే రాశారు. గతంలో కంగనా తన బయోపిక్‌ను నిర్మిస్తానని చెప్పిన విషయం తెలిసిందే.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.