బ్యాంకాక్‌లో బట్టలమ్ముతోన్న.. మనోహరి!

‘‘లేలో లేలో.. పాంచ్‌ సౌ.. కా మాల్‌.. సౌకో లేలో’’ అంటూ ఇక్కడ నిక్కర్లు అమ్ముతున్న ఈ అమ్మడిని గుర్తుపట్టారా? తనొక అద్భుత డ్యాన్సర్‌. ఐటెం గీతాలతో కుర్రకారును ఉర్రూతలూగించిన చిన్నది. ఇంకా ఆమె ఎవరో తెలియట్లేదా.. సర్లే ఇంకో క్లూ.. తను దర్శకధీరుడు రాజమౌళి చెక్కిన ‘బాహుబలి’ దృశ్యకావ్యంలోనూ ఓ ప్రత్యేక గీతంలో కనిపించి సందడి చేసింది. ఇప్పుడర్థమై ఉంటుంది. ‘‘మనోహరీ..’’ అంటూ అదరగొట్టే స్టెప్పులతో సందడి చేసిన ఆ ముద్దుగుమ్మ నోరా ఫతేహినే ఇక్కడ బట్టలమ్ముతున్న బుజ్జి. అదేంటి అంత పెద్ద స్టార్‌ నటి ఇక్కడిలా బట్టలమ్ముకుంటుందేంటి అనుకుంటున్నారా? మరేం లేదు.. ప్రస్తుతం ఈ భామ ‘స్ట్రీట్‌ డ్యాన్సర్‌ 3డి’లో ఓ ముఖ్యపాత్రలో నటిస్తోంది. వరుణ్‌ధావన్‌ - శ్రద్ధాకపూర్‌ జంటగా నటిస్తున్న చిత్రమిది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌ బ్యాంకాక్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగానే సెట్స్‌లో సరదాగా ఇలా సేల్స్‌ గర్ల్‌ అవతారమెత్తి కాసేపు అందరిలో నవ్వులు పూయించింది. ఈ వీడియోలో నోరా లుక్‌.. మేకప్‌ లేకుండా చాలా నేచురల్‌గా ఆకట్టుకునేలా ఉంది. తాజాగా ఈ వీడియోను అభిమానుల కోసం నెట్టింట్లో పోస్ట్‌ చేయగా.. అది కాస్తా ఇప్పుడు వైరల్‌గా మారుతోంది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.