ప్రియాంక పార్టీల తీరే వేరయా!

ఏం చేసినా అన్నీ పెళ్లికి ముందుగానే చేసుకోవాలనుకుందేమో... బాలీవుడ్‌ నటి ప్రియాంకచోప్రా. మొన్న బ్యాచ్‌లర్‌ పార్టీ. ఇప్పుడేమో ‘పైజామా పార్టీ’ అంటూ సందడి చేస్తోంది. ప్రియాంక చోప్రాకు వరసకు చెల్లెలైన పరిణీతి చోప్రా ట్విట్టర్లో ఓ ఫోటోను పెట్టింది. దానికి ‘బదాస్‌ పైజామా పార్టీ’ అని కామెంట్‌ రాసింది. దీన్ని బట్టి ప్రియాంక చోప్రా ఈ పార్టీని నిర్వహించిందని తెలుస్తోంది. ఆ ఫొటోలో అమ్మాయిలందరూ పింక్‌ పైజామాలతో సందడి చేశారు. గ్రూపు ఫోటో మధ్యలో ప్రియాంక డ్రెస్‌పై ‘బ్రైడ్‌ టు బి’ అని ఇంగ్లీష్‌ అక్షరాలు ఉన్నాయి. ఫోటోలో ప్రియాంక వెనుక ఇషా అంబానీ ముందు పరిణీతి చోప్రా ఉన్నారు. ప్రియాంక చోప్రా పెళ్లి, నిక్‌ జోనాస్‌తో డిసెంబర్‌ 1న జరుగనుందని తెలిసిందే. ఈలోపు ప్రియాంక ఇంకెన్ని పార్టీలిస్తుందో చూడాలి మరి.© Sitara 2018.
Powered by WinRace Technologies.