నాన్నతో ఇంటికి వెళుతున్నాం

బాలీవుడ్‌ నటుడు, నిర్మాత రాకేష్‌ రోషన్‌ గొంతు కేన్సర్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆయన కుమారుడు బాలీవుడ్‌ కథానాయకుడు హృతిక్‌ రోషన్‌ కొద్ది రోజుల క్రితం ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పుడు రాకేష్‌ చికిత్సను ముగించుకొని విజయవంతంగా ఇంటికి తిరిగి వెళ్లారు. కుటుంబ సభ్యలతో రాకేష్‌ రోషన్‌ ఆసుపత్రి నుంచి బయటకు వస్తున్న ఫోటోను హృతిక్‌ ట్విట్టర్లో షేర్‌ చేశారు. ‘‘కాంట్‌ స్టాప్, వోన్ట్‌ స్టాప్, వియ్‌ బిగెన్‌ అండ్‌ ఎగైన్‌ అండ్‌ ఎగైన్‌’’ అని ట్వీట్‌లో రాశారు. రాకేష్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.

© Sitara 2018.
Powered by WinRace Technologies.