‘రంగీలా’కి ఇరవైనాలుగేళ్లు

శివ’ చిత్రం తరువాత రామ్‌గోపాల్‌ వర్మ క్రేజ్‌ అమాంతంగా పెరిగింది. బాలీవుడ్‌లో వర్మ తీసిన ‘రంగీలా’ చిత్రం అప్పట్లో ఒక ఊపు ఊపింది. ఇందులో ఏ.ఆర్‌.రెహమాన్‌ సంగీత సారధ్యంలో వచ్చిన ‘యాయిరే..యాయిరే..’ పాట నటి ఊర్మిళకు ఎనలేని పేరు తెచ్చిపెట్టింది. ఇందులో మిలి (ఊర్మిలా) మున్నా (ఆమీర్‌ఖాన్‌) మంచి స్నేహితులు. ఇద్దరు కలిసి ముంబైకి వస్తారు. మిలి మంచి నటిగా రాణించాలనే ఆశ. మున్నా బ్లాక్‌లో సినిమా టిక్కెట్లు డబ్బులు సంపాదిస్తుంటాడు. ఇందులో రాజ్‌ కమల్‌ (జాకీష్రాఫ్‌)గా నటించాడు. మున్నా, రాజ్‌ కమల్‌ ఇద్దరూ మిలిని ప్రేమిస్తారు.  చిరవకు మిలీ కోసం వారిద్దరూ ఏమి త్యాగం చేశారనేది కథ చిత్ర కథ. ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర సుమారు పదిహేను కోట్ల రూపాయలను వసూళ్లు చేసింది. ఈ చిత్రానికి నటి ఊర్మిళకు ఫిలింఫేర్‌ అవార్డు అందుకుంది. అప్పట్లో ‘రంగీలా’కి పన్నెండు ఫిలింఫేర్‌ అవార్డు వచ్చాయి. ఆమీర్‌ఖాన్‌ మున్నాగా, జాకీష్రాఫ్‌ రాజ్‌కమల్‌గా నటించారు. వర్మ క్రియేషన్స్‌ పతాకంపై నిర్మితమైన సినిమాకి ఝాము షుగంధ్, రామ్‌గోపాల్‌ వర్మ నిర్మాతలు. సెప్టెంబర్‌ 8, 1995న విడుదలైన ఈ సినిమా నేటికి ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అయినా ఇప్పటికీ ‘రంగీలా’ పాట వినిపిస్తే చాలు కుర్రకారు మెలికలు తిరిగిపోతుంటారు.





Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.