గులాబీ ఇచ్చి.. ఆప్యాయంగా ముద్దిచ్చి!!

ల్లీబాయ్‌’ చిత్రంతో ఈ ఏడాది ఓ హిట్‌ను ఖాతాలో వేసుకున్నారు రణ్‌వీర్‌ సింగ్‌. ఇప్పుడీ జోష్‌లోనే తన తర్వాతి సినిమా ‘83’ను పట్టాలెక్కించేశాడు. భారత లెజెండరీ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌ జీవితాధారంగా ఈ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. కబీర్‌ ఖాన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌ లండన్‌లో శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉండగా.. తాజాగా రణ్‌వీర్‌ లండన్‌లో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కొందరు భారతీయులు ఆయన్ను చూసేందుకు పోటీపడ్డారు. ఆయనతో సెల్ఫీలు తీసుకోవడం కోసం పోటీ పడ్డారు. కానీ, రణ్‌వీర్‌ మాత్రం ఆ గుంపులోనే తన కోసం ఎదురుచూస్తున్న ఓ వృద్ధురాలి వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. చక్రాల కుర్చీలో లేవలేని స్థితిలో ఉన్న ఆ బామ్మ వద్దకు వెళ్లి ఆమెకు ఓ గులాబీ ఇవ్వడంతో పాటు ఆప్యాయంగా ఆమెను ముద్దాడారు. అనంతరం అక్కడి వారితో కాసేపు సరదాగా గడిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట సందడి చేస్తోంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.