రోహిత్‌ శెట్టి కొత్త కారు ధర తెలుసా?
బాలీవుడ్‌లో యాక్షన్‌ చిత్రాలను తెరకెక్కించడంలో దర్శకుడు రోహిత్‌ శెట్టిది ప్రత్యేకమైన శైలి. తను తీసే చిత్రాల్లో ఎక్కువగా కార్లు, బైక్‌ల ఛేజింగ్‌ సన్నివేశాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఆయనకు సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ కార్లన్నా, బైకులన్నా చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే ఇప్పుడు ఓ ఖరీదైన కారును కొనుగోలు చేశాడు. ఆ కారు ఖరీదు ఎంతో తెలుసా? అక్షరాలా మూడుకోట్ల రూపాయలు! ఆ కారుతో దిగిన ఫోటోను ఆ కారు కంపెనీ ట్విటర్లో పోస్టు చేస్తూ.. ‘‘భారతదేశంలోని అసాధారణమైన వ్యక్తుల కోసం ఒక అసాధారణమైన కారు. చిత్రసీమలోని విజయవంతమైన ప్రముఖ వ్యక్తులు ఇష్టపడుతున్నారు. ఇలాంటి అసాధరమైణన కారు రోహిత్‌కి వ్యక్తిత్వానికి ప్రతీక నిలుస్తుందంటూ..’’ పేర్కొంది. రోహిత్‌ శెట్టి ప్రస్తుతం అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటిస్తున్న ‘సూర్యవన్షి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కంటే ముందు రన్వీర్‌ సింగ్‌తో ‘సింబా’ అనే సినిమాని తెరకెక్కించారు. 139 కోట్లు పెట్టుబడితో తీసిన ఈ చిత్రం నాలుగు వందల కోట్లు సంపాదించి పెట్టిన ఈ చిత్రం రోహిత్‌ శెట్టికి ఎనలేని ఖ్యాతి తెచ్చి పెట్టింది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.