గుర్తుండిపోయే సినిమా

‘గోల్‌మాల్‌’, ‘సింగం’ సిరీస్‌లతో పాటు ఇటీవల వచ్చిన ‘సింబా’తో విజయవంతమైన దర్శకుడిగా పేరుతెచ్చుకున్నారు రోహిత్‌ శెట్టి. ఇప్పుడాయన నిర్మాతగా మారారు. రోహిత్‌ శెట్టి పిక్చర్స్‌ పతాకంపై ఇతర దర్శకులతో సినిమాలు నిర్మించడానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగా మొదటి చిత్రానికి దర్శకురాలు ఫరా ఖాన్‌ను ఎంచుకున్నారు. షారుఖ్‌ ఖాన్‌తో ‘మై హూ నా’, ‘ఓం శాంతి ఓం’, ‘హ్యాపీ న్యూ ఇయర్‌’ చిత్రాలు తెరకెక్కించి మెప్పించారు ఫరా. ఇప్పుడు రోహిత్‌ శెట్టి కోసం ఓ చిత్రాన్ని రూపొందించనున్నారు. పూర్తి స్థాయి కామెడీ యాక్షన్‌ చిత్రంగా ఇది తెరకెక్కనుందని రోహిత్‌ ప్రకటించారు. ఈ అవకాశంపై ఫరా ఆనందం వ్యక్తం చేశారు. ‘‘కొన్నిసార్లు మనం ఊహించని అవకాశాన్ని మనకు అందించడానికి ఈ విశ్వం కుట్ర పన్నుతుంది. నేను సోదరుడిగా ప్రేమించే రోహిత్‌తో కలసి పనిచేసే చిత్రం కోసం ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాను. ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రాల్లో గుర్తుండే సినిమాగా అది ఉంటుందని చెప్పగలన’’న్నారు ఫరా. ఇందులో నటించే నాయకానాయికలెవరన్నది తెలియాల్సి ఉంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.