బాయ్‌ఫ్రెండ్‌తో సుస్మిత రొమాంటిక్‌ కసరత్తులు

మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌ లేటు వయసులో ఘాటైన ప్రేమ కబుర్లతో నెట్టింట్లో సెగలు పుట్టిస్తోంది. ఆమె కొంతకాలంగా మోడల్‌ రోహ్మాన్‌ షాల్‌తో చెట్టాపట్టాలేసుకోని తిరుగుతోన్న సంగతి తెలిసిందే. త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నట్లుగా కొంత కాలంగా వార్తలు కూడా వస్తున్నాయి. తాజాగా సుస్మిత తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఇంట్లో కసరత్తులు చేస్తోన్న ఓ వీడియోను సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ వీడియోలో రోహ్మాన్‌తో కలిసి సుస్మితా చేసిన స్టంట్‌ చాలా హైలైట్‌గా ఉంది. ఆమె రోహ్మాన్‌ కాళ్లపై వెనుక నుంచి పడుకోగా.. అతను ఆమెను కాళ్లతోనే గాల్లోకి ఎత్తడం, ఆమె చిన్నపాటి తనని తాను బ్యాలన్స్‌ చేసుకుంటూ చిన్నపాటి కసరత్తులు చేయడం ఆకట్టుకొన్నాయి. అంతేకాదు ఈ వీడియో సుస్మితా - షాల్‌ల ప్రేమబంధాన్ని తెలియజేసేలా రొమాంటిక్‌గా ఉంది. దీనికి ఆమె ఓ ఆసక్తికర వ్యాఖ్యను కూడా జత చేసింది. ‘‘ఈ వర్కవుట్‌లో.. బలం, రూపం, ఫ్లెక్సిబులిటీ, బ్యాలన్స్‌ ఉండొచ్చు. నమ్మకం అనేది లేకపోతే ఇవేమీ కావు. రోహ్మాన్‌ షాల్‌ నువ్వు చాలా అదృష్టవంతుడివి. నీ కోసం నేను వెనక్కి వంగాను. నాకు తెలుసు నువ్వు నన్ను కింద పడకుండా పట్టుకుంటావని’’ అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.