Toggle navigation
కొత్త కబుర్లు
త్వరలో విడుదల
క్లిక్.. క్లిక్.. క్లిక్..
చూసేద్దాం.. వీడియో
సినిమా ఎలా ఉంది?
ముఖాముఖీ
ఇది విన్నారా?
తారాతోరణం
మరిన్ని
హాలీవుడ్ హంగామా
బాలీవుడ్ బాతాఖానీ
పాటల పల్లకి
సితార స్పెషల్
ఆణిముత్యాలు
అభిమానుల పేజీ
సినీ మార్గదర్శకులు
సినీ పజిల్స్
ఈరోజే
మీకు తెలుసా
హోమ్
సినీ మార్గదర్శకులు - సితార
టాలీవుడ్
మరిన్ని
బుర్రిపాలెం బుల్లోడు... అద్భుతాల అసాధ్యుడు
అతడొక అసాధ్యుడు. అసాధ్యుడే కాదు అఖండుడు కూడా. ఉంగరాల జుట్టుతో, ఊరించే కన్నులతో నూటొక్క జిల్లాలకి అందగాడు. హేమహేమీలుగా వున్న ఎన్టీఆర్, ఏయన్నార్‌లు చలనచిత్ర రంగాన్ని ఏలుతున్న సమయంలో అడుగుపెట్టి, సాహసమే ఊపిరిగా, పట్టుదలే సోపానంగా, ఓటమే విజయానికి పునాదిగా, నమ్మి
* కళాత్మక దర్శకుడు (బాలు మహేంద్ర వర్థంతి)
వసంత కోకిల... నిరీక్షణ... సంధ్యారాగం, చక్రవ్యూహం, సతీలీలావతి తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన దర్శకుడు బాలుమహేంద్ర. ‘తరం మారింది’, ‘సొమ్మొకడిది సోకొకడిది’, ‘లంబాడోళ్ళ రామదాసు’, ‘మనవూరి పాండవులు’, ‘శంకరాభరణం’, ‘సీతాకోక చిలుక’, ‘పల్లవి అనుపల్లవి’ తదితర చిత్రాలకి ఛాయాగ్రాహకుడిగా పనిచేసి, తన కెమెరా మాయాజాలంలో అద్భుతమైన సన్నివేశాల్ని తెరపై ఆవిష్కరించిన ఘనత ఆయనది.
అనితర సాధ్యుడు... అట్లూరి
ఆ రోజు 21 సంవత్సరాల ఓ యువకుడికి చాలా ఆనందంగా ఉంది. జాతిపిత బాపూజీ దర్శనానికి వచ్చే సందర్శకులను లోపలికి పంపే మహదవకాశం ఆ రోజు అతనికి లభించింది మరి.
శేఖర్ కమ్ముల.. మంచి కాఫీలాంటి సినిమాలు
ఇంటర్వెల్ కి ముందు... ఆ తర్వాత మూడు ఫైట్స్, మూడు సాంగ్స్... .మధ్య మధ్య కాస్త కామెడీ...ఇదీ తెలుగు సినిమా కిచిడి. ఏ కొత్త దర్శకుడు వచ్చినా ఇంచుమించు ఇదే ఫార్ములా. ఇదే చట్రం.
ఆయన ఒక్కో సినిమా ఒక్కో రత్నం!
ఆమె... తెలుగు సినిమాని శాసించిన అభినేత్రి. అతడు... ఆమె మేకప్ మాన్. ఆ సాదాసీదా మేకప్ మానే తర్వాతర్వాత పెద్ద నిర్మాతగా మారి ఎంతో మంది ఆర్టిస్ట్‌ల జాతకాలు తిరగ రాసిన చరిత్ర ఏదయినా ఉందంటే.
నవ్వుల రేడు ... నాగేష్
హాస్య నటుడు నాగేష్ పేరు చెప్పగానే నవ్వు వచ్చేస్తుంది. అతడు దక్షిణాది చార్లీ చాప్లిన్. గొప్ప రంగస్థల నటుడు, సాహిత్యాభిలాషి. తమిళ, తెలుగు, మళయాళ భాషల్లో వెయ్యికి పైగా చిత్రాల్లో నటించి హాస్య నటుడిగా సుస్థిర స్థానం సంపాదించినవాడు.
బాలీవుడ్
మరిన్ని
ఆమె జీవితం... సుమధుర ప్రేమ కావ్యం!
‘జీవితమే ఒక నాటకరంగం’ అన్నాడు ఆంగ్ల నాటక రచయిత షేక్స్పియర్. చరిత్రలో విఫలమైన ప్రేమకథలు యెన్నో! వాటిలో కొన్ని వెండితెర మీద కూడా దర్శనమిచ్చాయి. హిందీలో 1960లో వచ్చిన ప్రేమకథా కావ్యం ‘మొఘల్ -ఈ ఆజం’.
హృదయాలను దోచుకున్న హంగల్!
‘షోలే’ సినిమాలో వృద్ధుడు, అంధుడైన రహీమ్(ఇమామ్) చాచా కొడుకు అహ్మద్‌ను బందిపోటు గబ్బర్ సింగ్ చంపి గుర్రం మీద రామ్ నగర్‌కు పంపిస్తాడు. ఇమామ్‌కు ఆ వార్త చెప్పేందుకు గ్రామస్తులు సంశయిస్తూ వుండగా, ‘ఇత్నా సన్నాటా క్యో హై భాయీ’ అని అడుగుతాడు ఇమామ్.
ఆయన జీవితం... సినిమాకి అంకితం!
బహుముఖ ప్రజ్ఞశాలి అనే మాటకు సరైన అర్థం చెప్పినవారు భూపేన్ హజారికా. సినీ ప్రియులకు ఆయనో స్వరకర్త, గాయకుడు, దర్శకుడు, కవి, నటుడు. మేధావులకు ఆయనో పాత్రికేయుడు, నాయకుడు. తను అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ తనదైన ముద్రవేశారు భూపేన్ హజారికా.
బహుముఖ ప్రజ్ఞాశాలి..
సుభాష్ ఘయ్.. హిందీ సినిమాలను ఇష్టపడేవారికి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేని పేరిది. నటుడిగా వెండితెరపైకి దూకిన ఈ ప్రతిభాశాలి తర్వాతి కాలంలో రచయితగా, దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా, నిర్మాతగా బాలీవుడ్ సినీప్రియుల్ని అలరించారు.
బాలీవుడ్ గోల్డీ... విజయానంద్
గోల్డీ అని గర్వంగా పిలవబడే విజయానంద్ ప్రముఖ దర్శక నిర్మాత చేతన్ ఆనంద్, నటుడు, దర్శక నిర్మాత దేవానంద్ లకు ప్రియమైన తమ్ముడు. అంతే కాదు...’ విజయానంద్ గొప్ప కథా రచయిత, ధారణా శక్తి, వాగ్ధాటి గల మంచి చిత్ర నిర్మాత, దర్శకుడు.
వేణువై వచ్చి గాలిలో కలిసిన పర్వీన్ బాబి
ఆమె పేరు సినీ పరిశ్రమకు తెలియకముందే అద్భుతమైన మోడల్‌గా సౌందర్యారాధకులకు తెలుసు. అది యాడ్ ప్రపంచానికి బాగా అవసరమైన పేరు. సినిమా ప్రపంచమంటే ఆమె పెద్దగా పట్టించుకోలేదు. కానీ విధి ఆమెను బాలీవుడ్ చిత్రరంగానికి చేరువచేసింది. సినిమాలో నటించమని దర్శకనిర్మాత బి.ఆర్.ఇషారా ఆహ్వానం పలికితే కాస్త విస్తుపోయింది.
హాలీవుడ్
మరిన్ని
చలాకీ పిల్ల!
పదేళ్ల కల్లా నాట్య ప్రదర్శనలు ఇచ్చింది. పదమూడేళ్లకల్లా నృత్య కళలో అవార్డులు అందుకునేంత ఎదిగింది. ఆపై వేదికలపై మెరిసింది నటి వెరా ఎలెన్. ఇంత చలాకీ పిల్ల సినిమా వాళ్ల దృష్టిలో పడకుండా ఉంటుందా? అలాగే ప్రముఖ దర్శకుడు శామ్యూల్ గోల్డ్విన్ ఆమెలోని ప్రతిభను చూశాడు.
దారుణమైన విలన్లలో ఒకడు!
అరవై ఏళ్ల సినీ ప్రస్థానం... నటుడిగా, గాయకుడిగా, నృత్యకారుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా బహుముఖ నైపుణ్యం... రేడియో, టీవీ, వెండితెర మాధ్యామాల్లో ప్రయాణం... చారిత్రక, సాంఘిక, జానపద, హాస్య, ప్రతినాయక పాత్రలతో మమేకం.
తన కథ తనే తీసుకున్న దర్శకుడు!
ఆ సినిమా పేరును ఒక అంకె సూచిస్తుంది. అది 8 పక్కన అర. అంటే ‘ఎయిట్ అండ్ హాఫ్’ (ఎనిమిదిన్నర) అన్నమాట. ఇది ఓ హాలీవుడ్ దర్శకుడు తన గురించి తనే తీసుకున్న సినిమా. మరి ‘ఎనిమిదిన్నర’కి అర్థం ఏమిటి? ఏంటంటే.
అమెరికా అధ్యక్షుడైన నటుడు!
పేద కుటుంబంలో పుట్టిన ఓ కుర్రాడు... రకరకాల పనులు చేస్తూ ఎదిగి... నటుడిగా పేరు తెచ్చుకుని... చివరికి అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించాడు. అతడే అమెరికా 40వ అధ్యక్షుడు రోనాల్డ్ విల్సన్ రీగన్. ఇల్లినాయిస్లో 1911 ఫిబ్రవరి 6న పుట్టిన రోనాల్డ్ విల్సన్ రీగన్ చిన్నప్పటి నుంచే చురుగ్గా ఉంటూ ‘జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్’ అనిపించుకున్నాడు. తండ్రి జాక్ ఓ సేల్స్‌మన్.
హాలీవుడ్ స్వీటీ!
హైస్కూలు చదువుతున్న ఓ అమ్మాయి కోక్ కొనడానికి ఓ దుకాణానికి వెళ్లింది. అక్కడ ఆమె అందాన్ని చూసి ఓ వ్యక్తి ఆమెను సినీరంగానికి పరిచయం చేశాడు. ఫలితంగా ఆమె ్ఞహాలీవుడ్ స్వీట్ఠీ, ్ఞగోల్డెన్ గర్ల్ఠ్ అనిపించుకునేంతగా ఎదిగింది. గ్లామర్‌కి చిరునామాగా పేరొందింది. ఆమే లానా టర్నర్. మోడలింగ్, రేడియో, నాటక రంగం, టెలివిజన్, సినీ రంగాల్లో అందాల తారగా ఆమె పేరు మార్మోగిపోయింది.
ఆస్కార్ అందుకున్న తొలి బయోపిక్ హీరో!
ఓసారి ఓ నటుడు కోర్టుకు హాజరవ్వాల్సి వచ్చింది. బోనులో నుంచుని ప్రమాణం చేస్తూ... ‘‘ప్రపంచంలోనే గొప్ప నటుడిని అయిన నేను, అంతా నిజమే చెబుతాను...’’ అంటూ ప్రమాణం చేశాడు.
ప్రపంచ సినిమా
మరిన్ని
తిరుగులేని హాస్య నట చక్రవర్తి!
నల్లని కళ్లు... ఆ కళ్లల్లో జాలి... నిశితంగా చూస్తే, అంతులేని కారుణ్యం! తెల్లని మొహం... ఆ మొహంలో అమాయకత్వం... పరిశీలనగా చూస్తే, కట్టిపడేసే మానవత్వం! వెర్రిబాగుల వేషం... ఆ వేషంలో హాస్యం... తేరిపారి చూస్తే, నిలువెత్తు అభినయం!
చార్లీ చాప్లిన్ వ్యంగ్యాస్త్రం!
నవ్వుల చక్రవర్తి చార్లీ చాప్లిన్ తీసిన ఆఖరి నిశ్శబ్ద చిత్రం... పారిశ్రామిక విప్లవంపై ఎక్కుపెట్టిన వ్యంగ్యాస్త్రం.ఫ్యాక్టరీ కార్మికుల కష్టాల నేపథ్యంలో చిందిన హాస్యం... అదే ‘మోడర్న్ టైమ్స్’ (1936) సినిమా! చార్లీ చాప్లిన్ రచించి, స్వీయ దర్శకత్వంలో అద్భుతంగా నటించిన ఈ చిత్రం ఇప్పటికీ అలరిస్తుంది.
కాసులు కురిపించిన కుక్కపిల్లలు!
ఆ సినిమా ‘101 డాల్మేషియన్స్’. యానిమేషన్ విధానంతో తీసిన ఈ సినిమా 1961లో విడుదలైంది. డాల్మేషియన్ అనేది ఓ కుక్కల జాతి. ఇవి తెల్లని శరీరంపై నల్లని మచ్చలతో చాలా అందంగా ఉంటాయి. ఈ కుక్కపిల్లలతో ఓ చక్కని కథ అల్లి డోడీస్మిత్ అనే రచయిత్రి 1956లో పిల్లల కోసం ఓ నవల రాసింది.
జేమ్స్ క్యామెరాన్ ఇంద్రజాలం : ‘అవతార్’
భవిష్యత్తును లీలామాత్రంగానైనా సందర్శించగలగటం విశేషమే! అందులోనూ ఒక ఊహావిశ్వంలో విహరించటం మరీనూ! అలాంటి భవిద్దార్శనికుడు జేమ్స్ క్యామెరాన్. హాలీవుడ్లో సుప్రసిద్ధుడైన ఆయన స్వీయదర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘అవతార్’ 2009లో డిసెంబర్ 18న విడుదలై, బాక్సాఫీసు వద్ద అనూహ్య సంచలనాన్ని సృష్టించింది.
చరిత్ర మార్చిన రహస్య గూఢచారి...
జేమ్స్ బాండ్... ఇది అందరికీ పరిచయమైన పేరు. ఇయాన్ ఫ్లెమింగ్ తీర్చి దిద్దిన ఒక కాల్పనిక బ్రిటీష్ గూఢచారి పాత్ర పేరు జేమ్స్ బాండ్. ఇయాన్ ఫ్లెమింగ్ బ్రిటీష్ రచయిత, జర్నలిస్టు. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో ఆయన బ్రిటీష్ నౌకాదళం రహస్య గూఢచార విభాగంలో పని చేసినవాడు.
నేలమీద నడిచిన ‘మహాత్ముని’ కథ: ‘గాంధీ’
‘ఇలాంటి వ్యక్తి ఒకరు, రక్తమాంసాలతో ఈ నేలమీద నడిచారు అనే విషయాన్ని ముందుతరాలవారు విశ్వసించటం కూడా కష్టమే!’ అన్నారు సుప్రసిద్ధ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, మహాత్మా గాంధీ గురించి, గాంధీ 70వ జన్మదిన సందర్భంగా.