మెహ‌బూబా ఓ మెహ‌బూబా
article image
‘షోలే’‌ సిని‌మాలో ‌‘మెహ‌బూబా ఆయే మెహ‌బూబా, గుల్షన్‌ మే గుల్‌ ఖిల్తే హై జబ్‌ సెహరా మే మిల్తే హై’‌ అంటూ రాహు‌ల్‌దేవ్‌ బర్మన్‌ పాడిన పాటకు హెలెన్‌ నాట్యం చేస్తుంటే రుబాబ్‌ వాద్యాన్ని మీటుతూ అడు‌గులు వేసిన నటుడు జలాల్‌ ఆఘా.‌ యాభై‌ఏళ్లు నిండ‌కుం‌డానే ఆక‌స్మిక మరణం చెందిన జలాల్‌ ఆఘా పాత‌తరం హాస్య నటుడు ఆఘా కుమా‌రుడే.‌ ‌‘మొఘల్‌−‌ఎ−‌ఆజం’‌ (1960) సిని‌మాలో చిన్న‌నాటి జహం‌గీర్‌ (దిలీప్‌ కుమార్‌) పాత్రను పోషిం‌చింది.‌ జలాల్‌ ఆఘానే.‌ పెద్ద‌య్యాక సహాయ నటు‌డిగా ఖ్వాజా అహ‌మ్మద్‌ అబ్బాస్‌ నిర్మిం‌చిన ‌‘బొంబై రాత్‌కి బాహోం మే’‌ (1967) సిని‌మాలో జానీ పాత్రను పోషిం‌చాడు.‌ జలాల్‌ ఆఘాతో బాటు ఇదే సిని‌మాలో తొలి‌సారి బాలీ‌వుడ్‌ రంగ‌ప్రవేశం చేసిన పెర్సిస్‌ ఖంబట్టా కూడా యాభై ఏళ్లు నిండ‌కుం‌డానే మర‌ణిం‌చడం యాదృ‌చ్చికం.‌ తర్వాత తఖ్దీర్, ఆయా సావన్‌ ఝూమ్‌కే, సాత్‌ హిందూ‌స్తానీ, ఘర్‌ ఘర్‌ కి కహానీ, కట్‌ పుత్లి, గరమ్‌ హవా వంటి సిని‌మా‌లలో సహా‌యక పాత్రలు పోషిం‌చాడు.‌ పాత్ర చిన్నదే అయినా షోలే సిని‌మా‌లోని పాటతో జలాల్‌ అఘాకు మంచి పేరు వచ్చింది.‌ అంతకు ముందే విజయా వారి జులీ (చట్ట‌క్కారి మళ‌యాళ సిని‌మాకు రీమేక్‌) సిని‌మాలో రిచర్డ్‌ అనే మౌన ప్రేమి‌కుడి పాత్రలో బాగా రాణించి పేరు‌తె‌చ్చు‌కు‌న్నాడు.‌ విజయా వారి మరో సినిమా ‌‘ఘర్‌ ఘర్‌ కీ కహానీ’‌ లో కాలేజీ విద్యా‌ర్ధిగా ‌‘సమా హై సుహాన సుహాన’‌ అంటూ గిటార్‌ మీటుతూ పాడే పాత్రలో అద్భు‌తంగా రాణిం‌చాడు జలాల్‌ ఆఘా.‌ తోడి సి బేవఫా చిత్రంలో షబానా ఆజ్మికి అన్నగా, దిల్‌ ఆఖిర్‌ దిల్‌ హై సిని‌మాలో నసీ‌రు‌ద్ధిన్‌ షాకు స్నేహి‌తు‌డిగా సహాయ పాత్రల్లో జలాల్‌ ఆఘా జీవిం‌చాడని చెప్ప‌వచ్చు.‌ అలాగే ఇంగ్లిషు భాషా చిత్రాలు బాంబే టాకీ, గాంధీ, కిమ్, ది డిసీ‌వర్స్‌ వంటి చిత్రాల్లో కూడా చెప్పు‌కో‌దగ్గ పాత్రలలో కని‌పిం‌చాడు.‌ కుమార్‌ గౌరవ్, జుహీ చావ్లా జంటగా నటిం‌చిన గూంజ్‌ సిని‌మాకు దర్శ‌కత్వం వహించి సత్తా చాటు‌కు‌న్నాడు.‌ 1995లో 49 ఏళ్ల వయ‌సులో హృద్రో‌గంతో చని‌పో‌యిన జలాజ్‌ ఆఘా అరవై చిత్రా‌లకు పైగా నటిం‌చాడు.‌© Sitara 2018.
Powered by WinRace Technologies.