బాలీవుడ్లో గాయనులు ఎందరున్నా ప్రత్యేక గుర్తింపు పొందిన వారు కొందరే. అలాంటివారిలో ముబారక్ బేగం ఒకరు. ఆలిండియా రేడియోలో లైట్ మ్యూజిక్ విభాగంలో ఉద్యోగినిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమె, 1950-60 దశకంలో బాలీవుడ్ చిత్రాల్లో నేపథ్యగాయనిగా పేరు తెచ్చుకొంది. ముబారక్ బేగం 178 హిందీ గీతాలను ఆలపించింది. ఆమె ఆఖరి చిత్రం ‘నై ఇమ్రాత్’ 1981లో విడుదలైంది. 1936లో పుట్టిన ముబారక్ బేగం నాడీవ్యవస్థకు సంబంధించిన వ్యాధి కారణంగా అస్వస్థతకు గురై 2016 జులై 18న కన్నుమూసింది.