అప్పట్లోనే అత్యధిక పారితోషికం

విల్‌ రోజర్స్‌ గురించి చెప్పాలంటే చాలా చెప్పాలి. నటుడు, కౌబాయ్, హ్యూమరిస్ట్, న్యూస్‌పేపర్‌ కాలమిస్ట్, సోషల్‌ కామెంటేటర్‌... ఇలా. ఇన్ని రంగాల్లో ప్రముఖుడు కాబట్టే అతడిని ‘ఓక్లహామా ఫేవరిట్‌ సన్‌’ అని పిలుస్తారు. విమానంలో ప్రపంచాన్ని మూడు సార్లు చుట్టి వచ్చిన సాహసికుడు కూడా. హాలీవుడ్‌లో 50 మూకీలు, 21 టాకీల్లో నటించిన ఇతడు అప్పట్లోనే అత్యధిక పారితోషికం అందుకున్న నటుడిగా పేరొందాడు. న్యూస్‌ పేపర్‌ కాలమిస్ట్‌గా దాదాపు 4,000 వ్యాసాలు రాయడం విశేషం. ఓక్లహామాలో 1879 నవంబర్‌ 4న ఎనిమిది సంతానంలో చివరివాడిగా పుట్టిన ఇతడు చిన్నప్పుడే నటన పట్ల ఆకర్షితుడయ్యాడు. పలు రంగాల్లో రాణించిన ఇతడు తన 55 ఏట 1935 ఆగస్టు 15న విమాన ప్రమాదంలో మరణించడం విషాదం.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.