‘సైకో’ నటి!

ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు ఆల్‌ఫ్రెడ్‌ హిచ్‌కాక్‌ తీసిన ‘సైకో’ సినిమాలో అద్భుతంగా నటించిన నటిగా జానెట్‌ లీ పేరు మార్మోగిపోయింది. పద్దెనిమిదేళ్లకే అప్పటి ప్రఖ్యాత నటి నార్మా షేరర్‌ కంట్లో పడి, ఆమె సిఫార్సుతో ‘ఎమ్‌జీఎమ్‌’ చిత్ర నిర్మాణ సంస్థకు పరిచయమైంది. ‘ద రొమాన్స్‌ ఆప్‌ రోజీ రిడ్జ్‌’, ‘యాక్ట్‌ ఆఫ్‌ వయొలెన్స్‌’, ‘లిటిల్‌ ఉమెన్‌’, ‘ఏంజెల్స్‌ ఇన్‌ ద ఔట్‌ఫీల్డ్‌’, ‘నెకెడ్‌ స్పర్‌’ చిత్రాల్లో నటించినా ‘సైకో’ సినిమాతో స్టార్‌డమ్‌ పొందడంతో పాటు గోల్డెన్‌ గ్లోబ్‌ పురస్కారం అందుకుంది. కాలిఫోర్నియాలో 1927 జులై 6న పుట్టిన జానెట్‌ లీ నటిగానే కాక రచయిత్రిగా కూడా రెండు నవలలు వెలువరించింది. ఈమె 77 ఏళ్ల వయసులో 2004 అక్టోబర్‌ 3న మరణించింది.






Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.