సెక్స్‌ సింబల్‌...

ఒకప్పుడు అనితా ఎక్బెర్గ్‌ అంటే యువత వెర్రెత్తిపోయేది. ఆమె అందం అలాంటిది మరి. స్వీడన్‌లో పుట్టినా అమెరికా వచ్చి సెటిలైపోయింది. మోడల్‌గా ఏ బ్రాండ్‌కి చేసినా దాని అమ్మకాలు ఆకాశంలోనే. నటిగా ఏ సినిమాలో నటించినా కాసుల వర్షమే. ఎనిమిది మంది సంతానంలో ఒకతెగా పుట్టిన అనిత అమ్మ ప్రోత్సాహం మీద మోడల్‌గా ఎదిగింది. ఓ అందాల పోటీకి వెళితే, నిర్వాహకులు అవార్డు ఇచ్చి చప్పట్లు కొట్టేశారు. ఆ చప్పట్లే ఆమెను ‘మిస్‌ స్వీడన్‌’గా కూడా ఎంపికయ్యేలా చేశాయి. దాంతో అమెరికాలో ‘మిస్‌ యూనివర్స్‌’ పోటీ రమ్మని పిలిచింది. అందులో అవార్డు రాలేదు కానీ బోలెడు సినిమా అవకాశాలు వచ్చేశాయి. ‘ద మిసిసిపి గాంబ్లర్‌’, ‘ఎబ్బట్‌ అండ్‌ కాస్టెలో గో టు మార్స్‌’, ‘టేక్‌ మీ టు టౌన్‌’, ‘ద గోల్డెన్‌ బ్లేడ్‌’, ‘ఆర్టిస్ట్స్‌ అండ్‌ మోడల్స్‌’, ‘హాలీవుడ్‌ ఆర్‌ బస్ట్‌’ ఇలా ఎన్నో సినిమాల్లో అందంతో తళుక్కుమంది. ప్లేబాయ్‌ లాంటి ఎన్నో మేగజైన్ల ముఖచిత్రాల్లో మెరిసి ‘సెక్స్‌ సింబల్‌’గా పేరు తెచ్చుకుంది. హాలీవుడ్‌లో హాట్‌ భామగా ఎదిగిన ఈమె, తన 83వ ఏట 2015లో మరణించింది.





Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.